Bhuvaneswari Bus Yatra : టీడీపీ అధినేత చంద్రబాబు అరెస్టు ఏపీ రాజకీయాలను మలుపు తిప్పింది. ఇన్నాళ్లు టీడీపీ వ్యవహారాలను ఒంటి చేత్తో చక్కబెట్టిన చంద్రబాబు జైలులో ఉండడంతో పార్టీలో పరిస్థితులు మారిపోయాయి. ఎంత మంది నేతలు ఉన్నా… ముందుండి నడిపే నాయకత్వ లేమి స్పష్టంగా కనిపిస్తుంది. దీంతో టీడీపీ నేతలు… చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరిపై భారం వేశారు. భువనేశ్వరి బస్సు యాత్రకు ముహూర్తం ఫిక్స్ అయినట్లు తెలుస్తోంది. అక్టోబర్ మొదటి వారంలో బస్సు యాత్ర ప్రారంభం అవుతుందని సమాచారం. ఇప్పటికే పార్టీ సినియర్లు రూట్ మ్యాప్ సిద్ధం చేశారు. అన్ని జిల్లా కేంద్రాల్లోనూ బస్సు యాత్ర, సభలు ఏర్పాటుచేసేందుకు నిర్ణయించారు. బస్సు యాత్రకు ‘మేలుకో తెలుగోడా’ అనే పేరు ఖరారు చేసినట్లు తెలుస్తోంది. వారం రోజుల పాటు బస్సు యాత్ర సాగనుంది.