నాలుగున్నరేళ్ల చిన్నారిపై లైంగిక దాడి, హత్య -ఉరిశిక్ష విధించిన హైకోర్టు-tg high court verdict death penalty to four years old girl molested after death in rangareddy ,తెలంగాణ న్యూస్

అసలేం జరిగింది?

అల్కాపురి టౌన్‌షిప్‌లో ఒడిశాకు చెందిన భార్యభర్తలు కూలి పనులు చేసుకుంటూ జీవనం సాగించేవారు. మధ్యప్రదేశ్‌ కు చెందిన దినేష్‌ అనే వ్యక్తి అక్కడ సెంట్రింగ్‌ పని చేస్తూ ఉండేవాడు. దినేష్ ఒడిశా దంపతులతో స్నేహంగా ఉండేవాడు. 2021, డిసెంబర్‌12న ఇంటి ఎదుట ఆడుకుంటున్న ఒడిశా దంపతుల నాలుగున్నరేళ్ల కుమార్తెకు చాకెట్ల ఆశ చూపించి ఎవరూ లేని ప్రదేశానికి తీసుకెళ్లాడు. అనంతరం బాలికపై లైంగిక దాడి చేశాడు. బాలిక ఈ విషయాన్ని తల్లిదండ్రులకు చెబుతుందనే భయంతో బండరాయితో చిన్నారి తలపై బాది హత్య చేశాడు. చిన్నారి ఆచూకీ కనిపించకపోవడంతో తల్లిదండులు ఇంటి పరిసరాల్లో వెతికారు. అప్పటికీ చిన్నారి ఆచూకీ దొరక్కపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు విచారణ చేపట్టగా, చివరిసారిగా బాలికను దినేష్‌తో చూశామని స్థానికులు చెప్పారు. దీంతో పోలీసులు దినేష్ ను అదుపులోకి తీసుకుని ప్రశ్నించగా అసలు విషయం బయటపెట్టాడు. దీంతో పోలీసులు నిందితుడిపై లైంగిక దాడి, హత్యతో పాటు పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు. ఈ కేసులో అన్ని సాక్ష్యాలను పోలీసులు రంగారెడ్డి కోర్టుకు సమర్పించారు. దీంతో కోర్టు నిందితుడికి ఉరి శిక్ష విధించింది. రంగారెడ్డి కోర్టు తీర్పును నిందితుడు దినేష్ హైకోర్టు సవాల్‌ చేశాడు. తాజాగా హైకోర్టు రంగారెడ్డి కోర్టు తీర్పును సమర్థిస్తూ నిందితుడికి ఉరిశిక్షను ఖరారు చేసింది.

Source link