నాలుగేళ్ల చిన్నారికి విషమిచ్చి ఆపై తండ్రి ఆత్మహత్య-a father who poisoned a four year old child and then committed suicide ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్

Kurnool Murder: భార్య కాపురానికి రాకపోవడం, కుటుంబానికి దూరం కావడంతో ఓ వ్యక్తి నాలుగేళ్ల కుమారుడిని చంపి తాను ఆత్మహత్య చేసుకున్నాడు. ఓ చేత్తో కొడవలిని, మరో చేత్తో పురుగుమందు డబ్బాను పట్టుకుని నడిరోడ్డుపై వీరంగం సృష్టిస్తూ అందరిని హడలగొట్టాడు. చివరకు తన కుటుంబాన్నే బలితీసుకున్నాడు. ఈ ఘటనలో ముక్కు పచ్చలారని నాలుగేళ్ల చిన్నారి ప్రాణాలను బలితీసుకోవడంతో తల్లి కన్నీరు మున్నీరైంది.

Source link