నాకు ఎలాంటి రాజకీయ అభిమతాలు కానీ, పక్షపాతాలు కానీ లేవు, నేను ఏ పార్టీ ప్రచార కార్యకర్తను కాను. అందరు నాయకులపై నాకు గౌరవం ఉంది. ప్రతి ఒక్కరూ నాకు ఆదర్శనీయులు. నేను హాజరయ్యే కార్యక్రమాలు కేవలం కళాదృష్టితోనే చూడమని వేడుకుంటున్నాను. ఒక కళాకారిణిగా నాకు నా పాటే అన్నింటికన్నా ముఖ్యం. కళకు, కళాకారులకు ఎల్లలులేవని, ఎటువంటి బేధభావాలూ ఉండవని నమ్ముతున్నాను. దయచేసి నా పాటకు రాజకీయ రంగు పులమొద్దని, ఏ రాజకీయ పార్టీలతో నాకు సంబంధంలేదని మరోసారి విన్నవించుకుంటున్నాను. మీ ఇంటి ఆడబిడ్డగా నన్ను నాపాటను ఇలాగే ఆదరిస్తారని, ఆశీర్వదిస్తారనికోరుకుంటున్నాను”- సింగర్ మంగ్లి