Minister Lokesh : వైసీపీ కార్యకర్తల కోసం జగన్ 2.0 చూస్తారంటూ మాజీ సీఎం వైఎస్ జగన్ చేసిన వ్యాఖ్యలపై మంత్రి లోకేశ్ కౌంటర్ ఇచ్చారు. ‘ప్రజలు జగన్ 1.0 అరాచకం నుంచే ఇంకా బయటకు రాలేదు, విధ్వంసం మర్చిపోలేదు. ఇలాగే నా వెంట్రుక కూడా పీకలేరు అని ఎగిరారు. ప్రజలు ఉన్న 1.0 కూడా పీకేశారు. జగన్ కి, ప్రజలు ప్రతిపక్ష హోదా ఇవ్వకపోతే మేమేమి చేస్తాం. ఎమ్మెల్యేగా గెలిచిన ఆయన అసెంబ్లీకి రావటం ఆయన బాధ్యత. కనీసం పులివెందుల ప్రజల కోసమైనా అసెంబ్లీకి వచ్చి ప్రజా సమస్యల పై మాట్లాడాలి’ అని లోకేశ్ అన్నారు.