నా వ్యాఖ్యలు వక్రీకరించారు… ఉచిత విద్యుత్ పెటేంట్‌ మా పార్టీదేనన్న రేవంత్ రెడ్డి-tpcc chief revanth reddy fires on brs govt over power supply farmers

“ఉచిత విద్యుత్ పెటేంట్‌ కాంగ్రెస్ పార్టీదే. సొంతంగా వ్యవసాయం చేసిన వ్యక్తిని నేను. వ్యవసాయం గురించి పూర్తిగా నాకు తెలుసు. నేను దళారుల కుమారుడిని కాదు. దమ్ముంటే కేటీఆర్ నాతో పాటు వ్యవసాయ పనులు చేయడానికి రావాలి! విద్యుత్ డిస్కమ్ లను కేసీఆర్ కుప్పకూల్చేశారు. వారి స్వలాభాల కోసం విద్యుత్ చౌర్యానికి పాల్పడుతున్నారు. 2వేల కోట్ల యూనిట్ల విద్యుత్ ను రైతులకు ఉచితంగా ఇస్తున్నామని ప్రభుత్వం చెబుతోంది. రైతులకు తెలంగాణ సర్కార్ 24 గంటల కరెంట్ ఇవ్వటం లేదు. కేవలం 12 గంటలు కూడా ఉచిత విద్యుత్ సరఫరా కావటం లేదు. ఉచిత విద్యుత్ విషయంలో కాంగ్రెస్ కు ఎలాంటి ఇబ్బంది లేదు. రైతులకు ఉచిత విద్యుత్ ఇవ్వాలనేదే కాంగ్రెస్ విధానం. ఇదే విషయంపై అనేక సార్లు ధర్నాలు చేశాం. నేను కూడా ఖమ్మంలో స్వయంగా ధర్నాలో పాల్గొన్నాను. ప్రజలకు నష్టం చేకూర్చే ఏ పని మేం చేయం. అవినీతికి మారుపేరైన కేసీఆర్ ను రద్దు చేసి తీరుతాం. ఉచిత విద్యుత్ ముసుగులో ఏడాదికి 8వేల కోట్ల అవినీతికి కేసీఆర్ పాల్పడుతున్నాడు. ఎంపీ కోమటిరెడ్డి సవాల్ విసిరి… ఇవాళ సబ్ స్టేషన్ కు వెళ్లారు. అక్కడికి విద్యుత్ శాఖ మంత్రి ఎందుకు రాలేదు. 24 గంటల కరెంట్ పై మా పార్టీ నేతలు విసిరిన సవాల్ ను కేటీఆర్ స్వీకరిస్తారా…?” అని రేవంత్ రెడ్డి ప్రశ్నించారు.

Source link