నిర్మలా సీతారామన్‌కు స్వీటు తినిపించిన రాష్ట్రపతి ముర్ము, సామాన్యుడి నోరు తీపి చేస్తారా?

FM Nirmala Sitharaman | కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ రాష్ట్రపతి ద్రౌపది ముర్ముతో సమావేశం అయ్యారు. నేడు పార్లమెంట్ లో ప్రవేశపెట్టనున్న కేంద్ర బడ్జెట్ 2025ను రాష్ట్రపతి ముర్ముకు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ సమర్పించారు. బడ్జెట్ ప్రవేశపెట్టడానికి రాష్ట్రపతి అనుమతించారు. బడ్జెట్ టీమ్ తో సమావేశమైన ద్రౌపది ముర్ము ఏర్పాట్లపై అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా రాష్ట్రపతి ముర్ము కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ కు మిఠాయి తినిపించారు. దహీ చీని స్వీటును రాష్ట్రపతి ముర్ము స్వయంగా నిర్మలమ్మకు తినిపించి నోరు తీపి చేశారు.

తన నివాసం నుంచి కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్, ఆర్థికశాఖ సహాయమంత్రి, బడ్జెట్ టీమ్‌తో కలిసి రాష్ట్రపతి భవన్ కు చేరుకున్నారు. అక్కడ కేంద్ర మంత్రి నిర్మల్మమ్మ, బడ్జెట్ టీంకు ఆతిథ్యమిచ్చారు. బడ్జెట్ ప్రవేశపెట్టడానికి రాష్ట్రపతి నుంచి అనుమతి తీసుకున్న అనంతరం నిర్మలా సీతారామన్ టీమ్  రాష్ట్రపతి భవన్ నుంచి పార్లమెంట్ కు చేరుకుంది. అనంతరం కేంద్ర కేబినెట్ లో బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు. 

ప్రధాని మోదీ అధ్యక్షతన కేంద్ర కేబినెట్ ఉదయం 10:20 కి పార్లమెంట్ హౌస్ కాంప్లెక్స్‌లో సమావేశమైంది. బడ్జెట్‌కు కేంద్ర మంత్రివర్గం సైతం ఆమోదించనుంది. మంత్రివర్గం ఆమోదం తర్వాత ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఉదయం 11 గంటలకు లోక్‌సభలో కేంద్ర బడ్జెట్‌ను ప్రవేశిస్తారు. అనంతరం లోక్‌సభలో 2025 బడ్జెట్‌ను ప్రవేశపెట్టే ప్రక్రియ పూర్తయ్యాక గంట తర్వాత రాజ్యసభలో చర్చ ప్రారంభమవుతుంది.

 

 

మరిన్ని చూడండి

Source link