చనిపోయిన వారు పిల్లలు కాదు
నెల్లూరు ప్రభుత్వ ఆసుపత్రిలో ఆక్సిజన్ అందక రోగులు చనిపోవడం అవాస్తవమని ఆసుపత్రి సూపరంటెండెంట్ సిద్దా నాయక్, వైద్యులు వివరణ ఇచ్చారు. చనిపోయినవారు పిల్లలు కాదని, పెద్ద వయసు వారని, దీర్ఘ కాలిక రోగులని, వీరంతా తీవ్రమైన అనారోగ్యంతో ఈ ఆసుపత్రికి వచ్చారన్నారు. వీరికి వైద్య సేవలో ఎటువంటి లోపం లేకుండా డాక్టర్లు, వైద్య సిబ్బంది వైద్య సేవలు అందించారని చెప్పారు. ఆరుగురు ఒకేసారి చనిపోలేదని, మరణాలన్నీ 21వ తేదీ ఉదయం 9.30 నుంచి సాయంత్రం 6.30 మధ్య జరిగాయని, వీరంతా గత 3 నుంచి 5 రోజులుగా ఆసుపత్రిలో ట్రీట్మెంట్ తీసుకుంటున్నారని చెప్పారు. చనిపోయిన వారంతా జిల్లాలో పలు ప్రాంతాలకు చెందిన వారని, మృతదేహాలను ఒకే వాహనంలో తరలించామని ప్రచారం చేయడం కూడా అవాస్తవమన్నారు.