నెల్సన్ కథకు ఎన్టీఆర్ సిగ్నల్

మాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ గత ఏడాది దేవర తో బ్లాక్‌బస్టర్ హిట్ అందుకున్నాడు. కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా టాక్ ఎలా ఉన్నా ప్రపంచవ్యాప్తంగా అద్భుతమైన కలెక్షన్లను రాబట్టింది. దేవర విజయంతో బాలీవుడ్‌లో తన మార్కెట్‌ను మరింత బలపర్చుకున్న తారక్, మలయాళం, తమిళ పరిశ్రమల్లోనూ మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు.

ప్రస్తుతం ఎన్టీఆర్ బాలీవుడ్ డెబ్యూ ప్రాజెక్ట్ వార్ 2 షూటింగ్‌ను పూర్తి చేశాడు. ఈ సినిమా ఆగస్టు 2025లో విడుదల కానుంది. అలాగే కన్నడ స్టార్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ఓ భారీ ప్రాజెక్ట్ ప్రారంభించగా దీనిని సంక్రాంతి 2026లో విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నారు.

ఇటీవల జైలర్, బీస్ట్ సినిమాలతో తనదైన ముద్ర వేసిన తమిళ దర్శకుడు నెల్సన్ దిలీప్ కుమార్ తో ఎన్టీఆర్ ఓ సినిమా చేయబోతున్నట్టు గత కొంతకాలంగా వార్తలు వస్తున్నాయి. తాజా సమాచారం ప్రకారం నెల్సన్ చెప్పిన కథకు ఎన్టీఆర్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసాడని అన్ని అనుకున్నట్లు జరిగితే 2026లో ఈ సినిమా సెట్స్‌పైకి వెళ్లే అవకాశం ఉంది.

ప్రస్తుతం నెల్సన్ సూపర్ స్టార్ రజనీకాంత్ హీరోగా జైలర్ 2 తెరకెక్కిస్తున్నాడు. ఇటీవల విడుదల చేసిన ఈ సినిమా ప్రోమోకు అద్భుతమైన రెస్పాన్స్ లభించింది. ఇక ఎన్టీఆర్ నెల్సన్ ప్రాజెక్ట్‌ను సితార ఎంటర్టైన్మెంట్స్ అధినేత నాగవంశీ అత్యంత భారీ బడ్జెట్‌తో నిర్మించనున్నాడు.

ఈ భారీ ప్రాజెక్ట్‌పై త్వరలోనే అధికారిక ప్రకటన రానుండగా ఎన్టీఆర్ అభిమానులు క్యూరియాసిటీగా ఆయన సినిమాల గురించి రోజుకో వార్త కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

Source link