న్యూజిలాండ్ మాస్టర్ ప్లాన్! ప్రపంచకప్ కోసం భారత ఎనలిస్టు నియామకం-new zealand appoints indian analyst saurabh walkar for world cup 2023

World Cup: ఈ ఏడాది భారత్ వేదికగా జరగనున్న వన్డే ప్రపంచకప్ కోసం టీమ్స్ సిద్ధమవుతున్నాయి. అక్టోబర్ 5 నుంచి నవంబర్ 19వ వరకు జరిగే ఈ మెగా టోర్నీ కోసం ఇప్పటి నుంచే కసరత్తులు, ప్లానింగ్ చేసుకుంటున్నాయి. వరల్డ్ కప్‍లో న్యూజిలాండ్ కూడా ఓ హాట్ ఫేవరెట్‍గా ఉంది. 2019 వన్డే ప్రపంచకప్‍ ఫైనల్‍లో దురదృష్టంతో ఓడిన కివీస్ టీం ఈసారి కప్పు కొట్టాలనే పట్టుదలతో ఉంది. కాగా, ఈ ఏడాది వన్డే ప్రపంచప్ కోసం న్యూజిలాండ్.. భారత్‍కు చెందిన ఓ ఎనలిస్టును నియమించుకుంది. గతంలో రంజీల్లో ముంబైకు, ఐపీఎల్‍లో రాజస్థాన్ రాయల్స్ టీమ్‍కు పర్ఫార్మెన్స్ ఎనలిస్టుగా పని చేసిన సౌరభ్ వాకర్‌ను కివీస్ నియమించుకుంది.

Source link