వరద ఉద్ధృతి – తీర ప్రాంతాల్లో అలర్ట్…
ఎగువ రాష్ట్రాల్లో భారీవర్షాలు వల్ల స్వల్పంగా ఏపీలోని గోదావరి తీర ప్రాంతాల్లో కూడా వరద ఉధృతి పెరుగుతోంది. దీంతో ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ ముందస్తు చర్యలు చేపట్టింది. ముందస్తుగా ప్రభావిత జిల్లాల యంత్రాంగాన్ని అప్రమత్తం చేసింది. ఎప్పటికప్పుడు పరిస్థితులు పర్యవేక్షిస్తోంది. ముందస్తు సహయక చర్యలకు అల్లూరికు ఎన్డీఆర్ఎఫ్, ఏలూరుకు రెండు ఎస్డీఆర్ఎఫ్ బృందాలను తరలించింది. విపత్తుల నిర్వహణ సంస్థలో స్టేట్ కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసింది. అత్యవసర సహయం కోసం 24 గంటలు అందుబాటులో ఉండే స్టేట్ కంట్రోల్ రూమ్ నెంబర్లు 1070, 18004250101 ను అందుబాటులోకి తీసుకొచ్చింది. జిల్లాల్లో మండలస్థాయిలో కూడా అధికారులు కంట్రోల్ రూమ్స్ ఏర్పాటు చేయాలని అధికారులకు సూచించింది. లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని… బోట్లు, మోటర్ బోట్లు, స్టీమర్లలతో నదిలో ప్రయాణించడం చేయరాదని స్పష్టం చేశారు. వరద నీటిలో ఈతకు వెళ్ళడం, చేపలు పట్టడం లాంటివి చేయరాదని పేర్కొంది.