పదే.. పదే కలెక్టర్ల బదిలీలు..! ఎందుకిలా..?-repeated transfer of collectors in nalgonda district ,తెలంగాణ న్యూస్

ఎంపీ ఎన్నికలు ముగిసి కేంద్రంలో కొత్త ప్రభుత్వం ఏర్పాటైన కొద్ది రోజులకే జూన్ 16వ తేదీన ఆమె బదిలీ అయ్యారు. కేవలం ఎన్నికల నిర్వహణ కోసమే అన్నట్టుగా అసెంబ్లీ ఎన్నికల కోసం ఆర్.వి.కర్ణన్, పార్లమెంటు ఎన్నికల కోసం దాసరి హరిచందన కలెక్టర్లుగా నియమితులయ్యారా అన్న వ్యాఖ్యలు వినిపించాయి. హరిచందనకు జూన్ 16వ తేదీన బదిలీ కాగా, ఆమె స్థానంలో సి. నారాయణ రెడ్డి నల్గొండకు కలెక్టర్ గా వచ్చారు. గతంలో ఆయనకు ఇక్కడ జాయింట్ కలెక్టర్ గా పనిచేసిన అనుభవం ఉండడం, ఇక్కడి సమస్యలపై అవగాహన కూడా ఉండడం, గతంలో ములుగు, నిజామాబాద్, వికారాబాద్ జిల్లాలకు కలెక్టర్ గా పనిచేసిన అనుభవంతో జిల్లా పాలన గాడిలో పడుతుందని అంతా ఆశించారు.

Source link