ఎంపిక చేసిన గ్రామ, వార్డు సచివాలయాల్లో పైలట్ ప్రాజెక్టుగా గత ఏడాది నవంబర్, డిసెంబర్ మధ్య ఆధార్ సేవల్ని అందుబాటులోకి తీసుకువచ్చారు. గ్రామ, వార్డు సచివాలయ శాఖ ఆధ్వర్యంలోనే అన్ని రకాల ఆధార్ సేవల్ని దశల వారీగా రాష్ట్ర వ్యాప్తంగా విస్తరించారు. ఇందుకోసం ప్రతి సచివాలయంలో ఉన్న డిజిటల్ అసిస్టెంట్‌లకు ప్రత్యేక శిక్షణ ఇప్పించారు.