పరకాల కాంగ్రెస్ లో టికెట్ల కాక- తెరపైకి రోజుకో కొత్త పేరు-warangal parkal congress leaders fight for mla ticket in second list ,తెలంగాణ న్యూస్

మరి గాజర్ల అశోక్ పరిస్థితి?

ఒక వేళ నిజంగానే రాజకీయ శ్రేణుల్లో ప్రచారం జరగుతున్నట్లు పరకాలకు రేవూరి ప్రకాశ్ రెడ్డి పేరును పరిగణలోకి తీసుకుంటే.. ఇటీవలే పరకాల టికెట్ పై ఆశతో పార్టీలో చేరిన గాజర్ల అశోక్ కు ప్రత్యామ్నాయంగా మరో స్థానం గురించి ఆలోచన జరుగుతోందని కూడా తెలుస్తోంది. పాలకుర్తి నియోజకవర్గం నుంచి ఆయను పోటికి పెడితే ఎలా ఉంటుందన్న చర్చ పార్టీ నాయకత్వంలో జరిగిందంటున్నారు. పాల‌కుర్తిలో రాష్ట్ర మంత్రి ఎర్ర‌బెల్లి ద‌యాక‌ర్‌రావు బీఆర్ఎస్ నుంచి పోటీ చేస్తున్నారు. ఆయనకు ధీటైన అభ్యర్థి గాజర్ల అశోక్ అవుతారన్న అంచనాకు వచ్చినట్లు ప్రచారం జరగుతోంది. ఈ సారి పాలకుర్తి నుంచి హనుమాండ్ల ఝాన్సీ రెడ్డి టికెట్ ఆశిస్తున్నారు. కాగా, పాలకుర్తి ఏరియాలో గాజర్ల అశోక్‌ సుమారు ఆరేడేళ్ల పాటు దళ కమాండర్ గా, వివిధ హోదాల్లో పనిచేసి ప్రాంతంతో పరిచయం ఉండడంతో ఆ ఆలోచనకు వచ్చినట్లు తెలుస్తోంది. గాజర్ల అవోక్ 1995 నుంచి 2001 వరకు వర్ధన్నపేట, పాలకుర్తి, జనగామ, చేర్యాల, స్టేషన్ ఘన్ పూర్ ప్రాంతాల్లో దళ కమాండర్‌గా పనిచేశారు. పాలకుర్తి నియోజకవర్గం పరిధిలోని దాదాపు అన్ని గ్రామాల ప్రజలతో సంబంధాలు ఉన్నందున కలిసి వస్తుందని పార్టీ నాయకత్వం భావిస్తున్నట్లు చెబుతున్నారు. మొత్తానికి ఒక్క పరకాల నియోజకవర్గం అభ్యర్థి ఖరారు అంశం ఉమ్మడి వరంగల్ జిల్లాలోని రెండుమూడు అసెంబ్లీ నియోజకవర్గ ఎన్నికల రాజకీయాలను ప్రభావితం చేసే అంశంగా మారిందన్న అభిప్రాయం వ్యక్తం అవుతోంది.

Source link