పరారీలో రామ్ గోపాల్ వర్మ, రంగంలోకి రెండు పోలీస్ బృందాలు-హైకోర్టులో ముందస్తు బెయిల్ పిటిషన్ పై విచారణ వాయిదా-controversial director ram gopal varma running away ap police searching in social media case ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్

ఈ కేసులో తనకు ముందస్తు ఇవ్వాలని రామ్‌గోపాల్‌ వర్మ ఏపీ హైకోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్లపై హైకోర్టులో మంగళవారం వాదనలు జరిగాయి. ముందస్తు బెయిల్ పై తదుపరి విచారణను హైకోర్టు రేపటికి వాయిదా వేసింది. అయితే విచారణకు హాజరుకాకపోవడంతో…ఆర్జీవీ పరారీలో ఉన్నట్లు పోలీసులు ప్రకటించారు. ఆయన కోసం ప్రత్యేక బృందాలు ముమ్మరంగా గాలిస్తున్నాయి. సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, మంత్రి లోకేష్ లపై సోషల్ మీడియాలో అభ్యంతరకర పోస్టులు పెట్టారన్న అభియోగాలపై ఒంగోలు, విశాఖ, గుంటూరు జిల్లాలో ఆర్జీవీపై పలు కేసులు నమోదు అయ్యాయి. ఒంగోలులో నమోదైన కేసులో విచారణకు హాజరవ్వాలని ఇప్పటికే రెండుసార్లు పోలీసులు ఆర్జీవీకి నోటీసులు ఇచ్చారు. అయినా ఆర్జీవీ విచారణకు హాజరుకాకపోవడంతో పోలీసులు అరెస్టుకు రంగం సిద్ధం చేశారు. ఏపీ, తెలంగాణ, తమిళనాడులో ఆర్జీవీ కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు.

Source link