పల్లెల్లో సమరానికి సై.. రెండు విడతల్లో పంచాయతీ ఎన్నికలు?-panchayat elections likely to be held in two phases in telangana ,తెలంగాణ న్యూస్

సన్నద్ధంగా ఉండండి..

పంచాయతీ ఎన్నికలకు అన్నివిధాల సన్నద్ధంగా ఉండాలని.. పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ కార్యదర్శి లోకేష్‌కుమార్ తాజాగా అధికారులను ఆదేశించారు. జిల్లా పంచాయతీ అధికారులు, జిల్లా పరిషత్ సీఈవోలతో ఆయన వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడారు. రాష్ట్ర ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు.. పురపాలికల్లో విలీనమైన గ్రామ పంచాయతీలను ఎన్నికల జాబితా నుంచి తొలగించాలని సూచించారు. అక్కడి వారిని జీపీ ఓటర్ల జాబితా నుంచి తొలగించాలని స్పష్టం చేశారు. కొత్త ఏర్పాటైన మండలాల్లో ఎంపీటీసీ స్థానాలను గుర్తించాలని ఆదేశించారు. బ్యాలెట్ బాక్స్‌లు, ఇతర సామాగ్రిని సిద్ధం చేసుకోవాలని సూచించారు.

Source link