వైసీపీకి రాజీనామా
విశాఖపట్నం వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్ష పదవికి ఇటీవల పంచకర్ల రమేష్ రాజీనామా చేశారు. ఆయన జనసేన గూటికి చేరేందుకు రంగం సిద్దం చేసుకున్నారు. తన అభిమానులు, మద్దతుదారులతో చర్చించిన అనంతరం ఆయన ఈ నిర్ణయం తీసుకున్నారు. ఎన్నో ఆశయాలు, ఆశలతో రాజకీయాల్లోకి వచ్చానని అవి చేసే పరిస్థితి లేనపుడు ఆ పదవిలో కొనసాగడం సరికాదని భావించి రాజీనామా చేసినట్లు పంచకర్ల తెలిపారు. విశాఖ జిల్లాలో జరుగుతున్న పరిణామాలను వైసీపీ అధిష్టానం దృష్టికి తీసుకు వచ్చేందుకు ప్రయత్నించినా ఫలితం లేకుండా పోయిందన్నారు. తన మాట వినే అవకాశం లేనందునే పార్టీని వీడుతున్నట్లు రాజీనామా చేశానన్నారు.