Pawan Kalyan : జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఇటీవల వాలంటీర్ల వ్యవస్థపై సంచలన వ్యాఖ్యలు చేశారు. కొందరు వాలంటీర్లు ఉమెన్ ట్రాఫికింగ్ కు పాల్పడ్డారని ఆరోపించారు. పవన్ కల్యాణ్ పై ఓ మహిళా వాలంటీర్ విజయవాడ సివిల్ కోర్టులో క్రిమినల్ డిఫమేషన్ పిటిషన్ వేశారు. మహిళా వాలంటీర్ పిటిషన్ ను న్యాయమూర్తి విచారణకు స్వీకరించారు. ఏలూరు సభలో వాలంటీర్లపై పవన్ అనుచిత వ్యాఖ్యలు చేయడం పట్ల తాను మానసిక వేదనకు గురైనట్టు ఆమె కోర్టుకు తెలిపారు. మహిళా వాలంటీర్ తరఫున సెక్షన్ 499, 500, 504, 505 ప్రకారం లాయర్లు పిటిషన్ దాఖలు చేశారు. పవన్ కల్యాణ్ వ్యాఖ్యలపై విచారణ జరిపి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని మహిళా వాలంటీర్ కోర్టును కోరారు.