AP Ministers On Pawan : జనసేన అధినేత పవన్ కల్యాణ్ వారాహి యాత్రపై వైసీపీ నేతలు విమర్శలు కురిపిస్తున్నారు. సీఎం చేయాలని పవన్ చేసిన వ్యాఖ్యలపై మంత్రులు మండిపడ్డారు. పవన్ కల్యాణ్‌ను జనసేన నేతలు మానసిక వైద్యుడి దగ్గరకు తీసుకెళ్లాలని మంత్రి దాడిశెట్టి రాజా ఎద్దేవా చేశారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ…గంటకో విధంగా పవన్ మాట్లాడుతున్నారని విమర్శించారు. పవన్ కల్యాణ్ బహిరంగ సభలకు జనం రావడం లేదన్నారు. పవన్‌ను సీఎం కాదు కదా, ఎమ్మెల్యే చేయడానికి కూడా ప్రజలు సిద్ధంగా లేరని అంటూ మంత్రి దాడిశెట్టి రాజా తేల్చి చెప్పారు. తాను మంచి చేశానని భావిస్తేనే ప్రజలు తిరిగి ఓటు వెయ్యాలని సీఎం జగన్ కోరారని, అలా చెప్పే దమ్ము చంద్రబాబు, పవన్‌కు ఉందా? అని ప్రశ్నించారు. పవన్ కత్తిపూడి, పిఠాపురం రెండు సభలు అట్టర్ ప్లాప్ అయ్యాయన్నారు. ఎక్కడ పోటీ చేస్తారో కూడా పవన్‌కు క్లారిటీ లేదన్నారు. 2014-19లో టీడీపీ, జనసేన, బీజేపీ కలిసి రూపొందించిన మేనిఫెస్టోలో హామీలను అమలు చేయకపోతే చంద్రబాబును ఎందుకు నిలదీయలేదని పవన్ ను ప్రశ్నించారు.