పశు కిసాన్ క్రెడిట్ కార్డు
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పశుసంవర్ధక రైతులకు రాయితీపై రుణాలు అందిస్తుంది. రైతుల కోసం పశు కిసాన్ క్రెడిట్ కార్డ్ పథకం అమలు చేస్తుంది. ఈ కార్డు ద్వారా ఆవులు, గేదెలు, మేకలు, గొర్రెలు, కోళ్ల పెంపకం, చేపల పెంపకం, రొయ్యల పెంపకం..కింద రైతులకు అతి తక్కువ వడ్డీకి రుణాలు అందిస్తుంది. పశుసంవర్ధక రైతులకు ప్రోత్సాహం అందించేందుకు భారత ప్రభుత్వం ‘పశు కిసాన్ క్రెడిట్ కార్డ్’ని ప్రారంభించింది. పశు కిసాన్ క్రెడిట్ కార్డ్ ద్వారా పశుపోషణ, చేపల పెంపకానికి కావాల్సిన వర్కింగ్ క్యాపిటల్ ను బ్యాంకుల ద్వారా రైతులకు అందిస్తుంది. ఈ పథకం కింద పశువుల పెంపకందారులకు రూ.3 లక్షల వరకు రుణాలు అందిస్తారు. రూ.1.6 లక్షల వరకు రుణాలకు ఎలాంటి హామీ అవసరం లేదు.