Minister Harish Rao On Ponguleti: కాంగ్రెస్ పార్టీని టార్గెట్ చేస్తూ విమర్శలు గుప్పించారు మంత్రి హరీశ్ రావ్. శుక్రవారం ఖమ్మం జిల్లాలో పోడు పట్టాల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన… జిల్లా రాజకీయాలపై స్పందించారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో బీఆర్ఎస్ కు పట్టిన శని వదిలిందన్నారు. శకుని పాత్రలు, వెన్నుపోటు పొడిచేవాళ్లు పార్టీ నుంచి వెళ్లి పోయారంటూ పరోక్షంగా… మాజీ ఎంపీ పొంగులేటిని టార్గెట్ చేశారు. తాము వద్దనుకున్న వాళ్లను కాంగ్రెస్ తీసుకుంటోందని… దాంతో ఎదో అవుతుందని భ్రమ పడుతున్నారని ఎద్దేవా చేశారు.