బీజేపీకి మద్దతిచ్చే విషయంలో ఆంధ్రప్రదేశ్‌లోని ప్రధాన రాజకీయ పార్టీలైన వైసీపీ, టీడీపీలు ఒకే తరహాలో వ్యవహరిస్తుండటం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఏపీ అసెంబ్లీ ఎన్నికలతో పాటు సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీకి దగ్గర కావాలనే ఉద్దేశంతోనే టీడీపీ తమ పార్టీ ఎంపీలను డిల్లీ బిల్లుకు అనుకూలంగా ఓటు వేయాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. లోక్‌సభలో కూడా ఆ పార్టీకి ముగ్గురు ఎంపీలు ఉన్నారు. గతంలో కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన వివాదాస్పద రైతు చట్టాలకు టీడీపీ, టిఆర్‌ఎస్ పార్టీలు మద్దతునిచ్చాయి. రైతుల ఆందోళనతో కేంద్రం వాటిని ఉపసంహరించుకుంది.