75 ఏళ్లుగా దేశానికి సేవలు అందిస్తున్న పార్లమెంట్ భవనం గురించి మాట్లాడిన సందర్భంగా ప్రధానమంత్రి మోదీ కీలక ప్రసంగం చేశారు. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ విభజన నాటి పరిస్థితులు వివరించారు. అంతక ముందు చాలా రాష్ట్రాల విభజన జరిగిందని వివరించారు. అలా జరిగిన టైంలో రెండు రాష్ట్రాల్లోని ప్రజలంతా హ్యాపీగా సంబరాలు చేసుకున్నారని తెలిపారు. కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన టైంలో మాత్రం అలాంటి పరిస్థితులు కనిపించలేదని చెప్పుకొచ్చారు.