పాస్ పోర్ట్ చూపిస్తూ ఎయిర్ పోర్ట్ లో మహేష్

ఫ్యామిలీ తో జాలిగా ఏడాదికి మూడునాలుగు విదేశీ ట్రిప్స్ వేసే సూపర్ మహేష్ బాబు రాజమౌళితో సినిమా చేస్తున్నారు అనగానే.. మహేష్ ఎలా ఫీలయ్యారో కానీ, మహేష్ ఫ్యాన్స్ మాత్రం మహేష్ కి ఫ్యామిలీ వెకేషన్ ట్రిప్స్ ఎక్కడ దూరమైపోతాయో అని దిగులు పడిపోయారు, రాజమౌళితో సినిమా అంటే మహేష్ బందీ అయినట్లే అని అందరూ మట్లాడుకున్నారు. 

అందరూ అనుకోవడం కాదు తన సింహాన్ని బందించి పాస్ పోర్ట్ లాక్కున్నట్టుగా రాజమౌళి SSMB 29 స్టార్ట్ అయ్యేటప్పుడు వేసిన ట్వీట్ తెగ వైరల్ అయ్యింది. ఆతర్వాత రాజమౌళి సినిమా పూర్తయ్యేవరకు మహేష్ కి ఫ్యామిలీ ట్రిప్స్ లేవనుకున్నారు. ఇప్పటికే SSMB 29 రెండు షెడ్యూల్స్ ఫినిష్ అయ్యాయి. అందులో హైదరాబాద్ షెడ్యూల్, ఒడిశా షెడ్యూల్స్ పూర్తయ్యాయి. 

తాజాగా మహేష్ తన కుమార్తె సితారతో కలిసి ఎయిర్ పోర్ట్ లో కనిపించడమే కాదు, ఖుషీగా తన పాస్ పోర్ట్ చూపిస్తూ ఫోటో గ్రాఫర్స్ కు ఫోజులిచ్చారు. SSMB 29 తదుపరి షెడ్యూల్ కి బ్రేక్ రావ‌డంతో మ‌హేష్ బాబు కు రాజ‌మౌళి కాస్త స్వేచ్ఛ‌నిచ్చిన‌ట్టు తెలుస్తోంది. దానితో మహేష్ కుమార్తెని తీసుకుని విదేశాల్లో చదువుతున్న కొడుకు గౌతమ్ దగ్గరకు పయనమైనట్టుగా తెలుస్తోంది. 

Source link