పుష్ప2 మూవీపై ఆర్మూర్ బీజేపీ ఎమ్మెల్యే రాకేశ్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. పుష్ప సినిమా అంతా అవాస్తవమేనని, రూ.10 లక్షలున్న ఎర్ర చందనాన్ని, రూ.కోటి లాగా చూపించారన్నారు. దీంతో స్మగ్లింగ్ పెరిగిందని, లక్షలాది చెట్లు నరికేశారని ఆరోపించారు. ఇప్పుడు పుష్ప2తో ఇంకెన్ని చెట్లు నరికిస్తారో? అని ప్రశ్నించారు. యువతను తప్పుదోవ పట్టించేలా సినిమాలు తీస్తున్న అల్లు అర్జున్, సుకుమార్ ను అరెస్టు చేసి జైల్ లో వేయాలన్నారు. ఈ సినిమాను విడుదల చేయొద్దని డిమాండ్ చేశారు.