పెళ్లి ఎప్పుడో-ఎక్కడో చెప్పేసిన కీర్తి సురేష్


Fri 29th Nov 2024 01:42 PM

keerthy suresh  పెళ్లి ఎప్పుడో-ఎక్కడో  చెప్పేసిన కీర్తి సురేష్


Keerthy Suresh confirms wedding in Goa పెళ్లి ఎప్పుడో-ఎక్కడో చెప్పేసిన కీర్తి సురేష్

రెండు రోజుల క్రితమే తన పెళ్లి పై వస్తున్న వార్తలకు ఫుల్ స్టాప్ పెడుతూ.. తన చిన్ననాటి స్నేహతుడు ఆంటోనీని వివాహం చేసుకోబోతున్నట్టుగా మహానటి కీర్తి సురేష్ ప్రకటించిన విషయం తెలిసిందే. స్కూల్ మేట్, కాలేజ్ మేట్ అయిన తన స్నేహతుడిని కీర్తి సురేష్ వివాహం చేసుకోబోతున్నట్టుగా అనౌన్స్ చేసింది. 

ఇక ఈ రోజు శుక్రవారం తన తల్లితండ్రులతో కలిసి తిరుమల విచ్చేసింది. ఈరోజు తెల్లవారుఝామున వీఐపి బ్రేక్ దర్శన సమయంలో శ్రీవారిని దర్శించుకుని వేదపండితుల ఆశీర్వచనాలు అందుకున్న కీర్తి సురేష్ తన పెళ్లి ఎప్పుడో, ఎక్కడో రివీల్ చేసింది. 

తన పెళ్లి వచ్చే నెలలో అంటే డిసెంబర్ లో జరగబోతుంది. పెళ్లి వేడుక గోవా అని తాను డెస్టినేషన్ వెడ్డింగ్ చేసుకోబోతున్నట్టుగా కీర్తి సురేష్ శ్రీవారి దర్శనానంతరం మీడియా తో మట్లాడుతూ కన్ ఫర్మ్ చేసింది. 


Keerthy Suresh confirms wedding in Goa:

Keerthy Suresh visits tirumala





Source link