Rahul Gandhi Comments On BPSC Leak: లోక్‌సభ ప్రతిపక్ష నాయకుడు, కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ మంగళవారం బీహార్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (BPSC) అభ్యర్థుల ఆందోళనను ప్రస్తావిస్తూ, ‘భారతదేశ పేద యువత హక్కులను లాక్కోవడానికి, వారి నైపుణ్యాలను, కలలను అణచివేయడానికి పేపర్ లీక్ ఒక ఆయుధం’ అని అన్నారు. ఈ అంశాన్ని పార్లమెంటులో కూడా లేవనెత్తుతానని ఆయన అన్నారు. రాహుల్ గాంధీ ఇటీవల పాట్నాలో BPSC పరీక్షలో పేపర్ లీక్‌కు వ్యతిరేకంగా ఆందోళన చేస్తున్న యువతను కలిశారు. రాహుల్ గాంధీ మంగళవారం తన సోషల్ మీడియా ఛానెల్‌లో ఓ వీడియోను షేర్ చేశారు. దీనిలో భారతదేశంలో పెరుగుతున్న పేపర్ లీక్ కేసులు, దాని వల్ల ప్రభావితమైన పేద యువత హక్కులపై తీవ్రమైన ప్రశ్నలు లేవనెత్తారు. ఈ సమస్య ఒక్క బీహార్‌కే పరిమితం కాలేదని.. దేశవ్యాప్తంగా యువత దీని వల్ల ఇబ్బంది పడుతున్నారని కూడా ఆయన అన్నారు.
బీపీఎస్‌సీ పరీక్షల కుంభకోణం
రాహుల్ గాంధీ ముఖ్యంగా బీహార్‌లో జరిగిన బీపీఎస్‌సీ పరీక్షల కుంభకోణాన్ని ఈ వీడియోలో ప్రస్తావించారు. బీహార్‌లో ఇటీవల జరిగిన పరీక్షల సందర్భంగా ప్రశ్నాపత్రాలు లీక్ అయ్యాయని, ఈ సంఘటనలు ఆ రాష్ట్రానికే పరిమితం కాదని, దేశవ్యాప్తంగా బీజేపీ పాలిత రాష్ట్రాల్లోనూ జరుగుతున్నాయని ఆయన అన్నారు. ఈ కుంభకోణాల్లో పాల్గొన్న వారిపై ఎటువంటి చర్యలు తీసుకోవడం లేదని, ప్రభుత్వం ఈ సంఘటనలను విస్మరిస్తోందని పేర్కొన్నారు. బీహార్‌లో ఇటీవల జరిగిన BPSC పరీక్ష కుంభకోణం, ఆ తర్వాత పోలీసుల లాఠీచార్జీ, హింస కారణంగా నష్టపోయిన విద్యార్థులను కలుసుకుని తీవ్రమైన అంశాలపై రాహుల్ గాంధీ చర్చించారు. ఈ పేపర్ లీక్, పరీక్షా కుంభకోణం గురించి రాహుల్‌కు విద్యార్థులు వివరంగా వెల్లడించారు.
देखिए पटना में BPSC की तैयारी करने वाले छात्रों ने मुझे क्या बताया – क्रिमिनल्स को गिरफ़्तार करने की जगह पुलिस छात्रों को पीट रही है और सरकार का फोकस सिर्फ़ भ्रष्टाचार के घिनौने खेल को छुपाने पर है। pic.twitter.com/VaFW219fOt
— Rahul Gandhi (@RahulGandhi) January 21, 2025
విద్యార్థులతో రాహుల్ సమావేశం
బీహార్‌లో బిపిఎస్‌సి(BPSC) పరీక్ష తర్వాత రాహుల్ గాంధీ విద్యార్థులతో సమావేశమయ్యారు. వారు పరీక్ష పేపర్ లీక్‌లు, పరీక్షలో రిగ్గింగ్ గురించి వివరంగా మాట్లాడారు. పరీక్షల సమయంలో ప్రశ్నాపత్రాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయని, అందువల్ల తమ శ్రమ వృథా అవుతుందని విద్యార్థులు వాపోయారు. దీనితో పాటు ప్రభుత్వం సాధారణీకరణ, స్కేలింగ్ వంటి ప్రక్రియలను అవలంబించడం ద్వారా విద్యార్థులు వారి వాస్తవ స్కోర్‌లను కోల్పోతారు. దీని కారణంగా ఉపాధి దొరకడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. గాంధీ పద్ధతిలో నిరసన తెలుపుతున్న విద్యార్థులపై పోలీసులు జరిపిన క్రూరమైన లాఠీఛార్జిని రాహుల్ గాంధీ తీవ్రంగా ఖండించారు. నిరసన తెలుపుతున్న విద్యార్థులపై బలవంతంగా కేసులు నమోదు చేస్తున్నారని, వారి గొంతుకను అణచివేస్తున్నారని ఆయన అన్నారు. 28 BPSC పరీక్షా కేంద్రాల్లో రిగ్గింగ్ జరిగిందని రాహుల్ వెల్లడించారు. కానీ ప్రభుత్వం ఈ వాస్తవాలను అంగీకరించడానికి సిద్ధంగా లేదన్నారు.
విద్యార్థుల గొంతుకవుతా
ఈ వీడియో ద్వారా రాహుల్ గాంధీ పార్లమెంటులో న్యాయం, పునఃపరిశీలన కోరుతున్న వేలాది మంది విద్యార్థుల గొంతును పెంచుతానని హామీ ఇచ్చారు. ఇది బీహార్ సమస్య మాత్రమే కాదని, మొత్తం దేశ యువత సమస్య అని ఆయన అన్నారు. రాహుల్ గాంధీ కూడా ఈ యువత పోరాటంలో తాను మద్దతు ఇస్తానని, వారి కలలను ఎవరూ అణిచివేయనివ్వనని అన్నారు.
మరిన్ని చూడండి