పొరపాటున మోహన్ బాబు పేరు చెప్పాం- రంగంపేట ఘటనలో ఎంపీటీసీ, ఉపసర్పంచ్ యూటర్న్-tirupati rangampeta land issue mptc vice president take u turn no relation to actor mohan babu

మోహన్ బాబు యూనివర్సిటీలో పనిచేస్తున్న సతీష్, మంచు అసోసియేషన్ అధ్యక్షుడు సునీల్ చక్రవర్తి నిందితులకు ఫొటోలు పంపించి రూ.3 వేలు ఫోన్ పే ద్వారా దాడి చేయాలని చెప్పారని గ్రామస్థులు ఆరోపించారు. గ్రామస్థుల ఫిర్యాదుతో చంద్రగిరి పోలీసులు రంగంపేట చేరుకుని నిందితుడు హేమంత్ ను అదుపులోకి తీసుకున్నారు. నిందితుడి నుంచి కర్రలు, కత్తి, పెట్రోల్ స్వాధీనం చేసుకున్నట్లు తెలుస్తోంది. సినీనటుడు మోహన్ బాబు, పీఆర్వో సతీష్, సునీల్ చక్రవర్తి వల్ల మాకు ప్రాణహాని ఉందని ఎంపీటీసీ బోస్ చంద్రారెడ్డి, ఉపసర్పంచ్ ఆరోపించారు. పోలీసులు తమకు రక్షణ కల్పించాలని బోస్ చంద్రారెడ్డి కోరుతున్నారు. రంగంపేట కూడలిలో రంగపేట గ్రామస్థులు, బాధితులు ధర్నా చేశారు. మోహన్ బాబు యూనివర్సిటీలో అరాచకాలు నశించాలని, మోహన్ బాబు డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేశారు. అయితే ఈ ఘటనపై ఎంపీటీసీ, ఉపసర్పంచ్ యూటర్న్ తీసుకున్నారు. మోహన్ బాబుకు ఈ ఘటనతో సంబంధం లేదన్నారు.

Source link