పోలీసుల ఎదుట లొంగిపోయిన హిడ్మా కూతురు.. వంజెం కేషా తలపై రూ.4 లక్షల రివార్డు-female maoist vanjem kesha surrenders before warangal police ,తెలంగాణ న్యూస్

సీపీ ఎదుట లొంగుబాటు..

దాదాపు దశాబ్ద కాలంపాటు మావోయిస్టు పార్టీలో కొనసాగిన వంజెం కేషా.. శుక్రవారం వరంగల్ సీపీ అంబర్​ కిశోర్​ ఝా ఎదుట లొంగిపోయింది. ఈ సందర్భంగా సీపీ అంబర్​ కిశోర్​ ఝా మాట్లాడుతూ.. మావోయిస్టు పార్టీపై ప్రజల్లో వ్యతిరేకత రావడం, ఆరోగ్యం కుడా సహకరించక పోవడంతో కేషా లొంగిపోయినట్లు తెలిపారు. తెలంగాణ ప్రభుత్వం లొంగిపోయిన మావోయిస్టు పార్టీ సభ్యులకు అందిస్తున్న పునరావాస పథకాలకు ఆకర్షితులు అవుతున్నారని చెప్పారు. సరెండర్​ అయ్యేందుకు పూర్తి సహాయ సహకారాలు అందిస్తామని ఇచ్చిన వాగ్ధానం మేరకు కేషా జనజీవన స్రవంతిలో కలిసిందని వివరించారు.

Source link