Phone Tapping Case : ఫోన్ ట్యాపింగ్ కేసులో అరెస్టైన పోలీస్ బాస్ లు ఒక్కొక్కరిగా నోరువిప్పుతున్నారు. రాధా కృష్ణరావు, భుజంగరావు, ప్రణీత్ రావు, తిరుపతన్న వాంగ్మూలాల్లో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. బీఆర్ఎస్ పార్టీ ఆదేశాలతోనే ఫోన్ ట్యాపింగ్ కు పాల్పడినట్లు ఒప్పుకున్నారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో ఎస్ఐబీ మాజీ డీఎస్పీ ప్రణీతరావు వాంగ్మూలంలో సంచలన విషయాలు పేర్కొన్నారు. 1200 మంది ఫోన్లను ట్యాపింగ్ చేసినట్లు ప్రణీత్ రావు ఒప్పుకున్నారు. రాజకీయ నేతలు, ప్రతిపక్ష నేతలు, న్యాయమూర్తులు, రాజకీయ నేతల కుటుంబ సభ్యులు, మీడియా పెద్దలు, జర్నలిస్టులు, రియల్ ఎస్టేట్ వ్యాపారులు, వ్యాపారవేత్తలు, ప్రతిపక్షాల మద్దతుదారుల ఫోన్లను ట్యాపింగ్ చేసినట్లు అంగీకరించారు. అధికారికంగా 3 ఫోన్లు, అనధికారికంగా 5 ఫోన్లు మొత్తం 8 ఫోన్ల ద్వారా ఎప్పటికప్పుడు మానిటరింగ్ చేశామని ప్రణీత్ రావు తెలిపారు.