బుధవారం ఉదయం ఢిల్లీ పర్యటనకు వెళ్లిన సీఎం జగన్… సాయంత్రం 4:30 గంటలకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో భేటీ అయ్యారు. ప్రధానితో సమావేశానికి ముందు కేంద్ర హోంమంత్రి అమిత్‌షాతో సమావేశమయ్యారు. దాదాపు 45 నిమిషాలసేపు భేటీ కాగా… రాష్ట్రానికి రావాల్సిన నిధులు, బకాయిలపై చర్చించారు. ప్రధానితో సమావేశం తర్వాత కేంద్రం ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌తో ముఖ్యమంత్రి జగన్ సమావేశమయ్యారు. రాష్ట్రానికి సంబంధించిన వివిధ అంశాలపై చర్చించారు. ఢిల్లీ పర్యటనను ముగించుకుని సీఎం తిరిగి తాడేపల్లికి సీఎం జగన్ బయల్దేరారు.