ఇప్పటికే అక్టోబర్ 15వ తేదీన అహ్మదాబాద్ వేదికగా ఇండియా, పాకిస్థాన్ మధ్య జరగాల్సిన మ్యాచ్ ఒకరోజు ముందుకు వచ్చింది. అక్టోబర్ 15న నవరాత్రి ఉత్సవాల ప్రారంభం ఉండటంతో ఈ మ్యాచ్ను అక్టోబర్ 14కు మార్చింది ఐసీసీ. అలాగే, హైదరాబాద్ వేదికగా పాకిస్థాన్, శ్రీలంక మధ్య అక్టోబర్ 12 జరగాల్సిన మ్యాచ్ అక్టోబర్ 10కి మారింది. ఇప్పుడు, పాకిస్థాన్, ఇంగ్లండ్ మధ్య మ్యాచ్ తేదీ కూడా మారేలా కనిపిస్తోంది.