అక్టోబర్ 5న అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో ఇంగ్లండ్, న్యూజిలాండ్ జట్ల మధ్య ప్రపంచ కప్ ఓపెనింగ్ మ్యాచ్ జరగనుంది. అక్టోబర్ 8న చెన్నైలోని ఎంఏ చిదంబరం స్టేడియంలో ఆస్ట్రేలియాతో టీమిండియా ఆడనుంది. ఆ తర్వాత అక్టోబర్ 15న అహ్మదాబాద్‌లో భారత్-పాకిస్థాన్ మధ్య హైవోల్టేజ్ మ్యాచ్ జరగనుంది.