కాంట్రాక్టు ఉద్యోగులను క్రమబద్దీకరించే వరకు కొత్త నోటిఫికేషన్లు ఇవ్వొద్దని కోరినట్లు సచివాలయ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు వెంకట్రామిరెడ్డి చెప్పారు. గ్యారంటీ పెన్షన్ స్కీమ్ ప్రకారం ఉత్తర్వులు ఇచ్చే ముందు చర్చించాలని, ఉద్యోగుల ఇళ్ల స్థలాలకు జిల్లా కేంద్రాల్లో వంద ఎకరాలు కేటాయించాలని, ఔట్ సోర్సింగ్ సిబ్బంది జీతాలు పెంచాలని , హెల్త్ స్కీమ్ పథకాలు అందించాలని కోరినట్టు చెప్పారు.