ప్రిస్టేజ్‌కు పోవద్దు.. గట్టిగానే ఇవ్వండి!

మంత్రులూ.. ఎవరూ ప్రిస్టేజ్‌కు పోవద్దు..! తెలియకపోకపోతే తెలుసుకోండి..! రాకపోతే నేర్చుకోండి..! ఏం చేసైనా సరే గట్టిగా ఇచ్చి పడేయాల్సిందే..! ఇందులో వెనుకంజ వద్దు.. అస్సలు తగ్గొద్దంటే తగ్గొద్దు అంతే..! ఎవ్వరూ తగ్గొద్దు.. తగ్గాల్సిన అవసరమే లేదు.. గట్టిగా ఇచ్చిపడేయండి..! ఏంటబ్బా ఇవన్నీ.. అసలేం జరుగుతోంది.. అని అనుకుంటున్నారు కదూ.. అదేం కాదండోయ్.. ఆంధ్రప్రదేశ్ కేబినెట్ సమావేశంలో మంత్రులకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చేసిన దిశానిర్దేశమిది. అవునా.. ఇంతకీ ఏ విషయంలో ఇంతగా క్లాస్ తీసుకున్నారు..? ఇకపై రాష్ట్రంలో రాజకీయం హీటెక్కిపోనుందా..? అనే ఇంట్రెస్టింగ్ విషయాలు తెలుసుకుందాం వచ్చేయండి మరి..!

సబ్జక్టుతో.. ఫుల్ క్లారిటీగా!

కూటమి అధికారంలోకి వచ్చిన నాటి నుంచి వైసీపీ ఎలా ప్రవర్తిస్తోందనేది మనమంతా, సభ్య సమాజం చూస్తోంది కదా..! అలాంటప్పుడు మంత్రుల నుంచి ఎలాంటి రియాక్షన్, కౌంటర్ లేకపోతే ఎలా..? ఇదేం పద్ధతి..? సంబంధిత శాఖల మంత్రులు కూడా మాట్లాడకుండా మౌనం పాటిస్తే ఎలా..? ఇకపైనా ఎవరూ నోరు మూసుకొని కూర్చోనక్కర్లేదు..! మనమేంటో వైసీపీ అండ్ కోకు చూపించాల్సిందేనని మంత్రులకు గట్టిగానే క్లాస్ తీసుకున్నారు నారా చంద్రబాబు. అది కూడా ఏ రేంజిలో అంటే.. వైసీపీ విమర్శలకు ఎవరూ తగ్గనక్కర్లేదు.. తగ్గేదేలా అంటూ ఇచ్చి పడేయండి.. క్లారిటీగా, సబ్జక్టుతో కొట్టండి..! ఇందులో ఏ మాత్రం వెనుకంజ, అలసత్వం వహిస్తే అస్సలు ఊరుకునేదే లేదని ఒకింత వార్నింగ్ కూడా ఇచ్చారట.

తప్పేముంది..?

ఒకవేళ సబ్జక్టు మీద పట్టులేకపోతే తెలుసుకోండి.. అందులో మొహమాటం, ప్రిస్టేజ్‌కు వెళ్లకండని కూడా మంత్రులకు చంద్రబాబు సూచించారు. అంతేకాదు.. ఒక్క కౌంటర్ విషయంలోనే కాదు.. మీ మీ శాఖల పరంగా కూడా ఎలాంటి సందేహాలున్నా సరే సీనియర్లతో చర్చించి, అవసరమైతే చాంబర్లకు పిలిపించుకుని మరీ అడిగి తెలుసుకోవాలని కూడా మంత్రులకు చంద్రబాబు సూచించారట. తెలియని విషయాలు తెలుసుకుంటే తప్పేంటి..? పోయేదేముంది చెప్పండి.. అందుకే సబ్జక్టు క్లియర్‌గా తెలుసుకుని ఒకటికి, పదిసార్లు ఆలోచించి ఏదైనా చేయాలని, మనవైపు నుంచి ఎలాంటి తప్పు లేకుండా చూసుకోవాలని కూడా చంద్రబాబు సూచించారట. ఇకపై వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మొదలుకుని ఎవరు మీడియా ముందుకొచ్చినా సంబంధిత శాఖల మంత్రులు, ఎమ్మెల్యేలు, అధికార ప్రతినిధులు గట్టిగా ఇచ్చేయాలని ఆదేశించారట. మొత్తానికి చూస్తే.. ఇప్పుడిప్పుడే కాక మీదున్న ఏపీ రాజకీయాలు మరింత హీటెక్కనున్నాయని దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు.

Source link