చేరికకు గ్రీన్ సిగ్నల్….
మరికొద్దిరోజుల్లోనే తెలంగాలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ క్రమంలో ప్రధాన పార్టీలన్నీ రేసు గుర్రాలపై ఫోకస్ పెట్టడమే కాదు… ప్రభావితం చేసే నేతలతో కూడా మంతనాలు చేస్తోంది. ఈ క్రమంలోనే… టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి దూకుడు పెంచుతున్నారు. పలు జిల్లాల నుంచి చేరికలు కూడా మొదలయ్యాయి. ఇదే టైంలో… తన సొంత నియోజకవర్గానికి చెందిన బీఆర్ఎస్ నేత, మాజీ ఎమ్మెల్యే గురునాథ్ రెడ్డిని రేవంత్ రెడ్డి కలిశారు. పార్టీలో చేరాలని ఆహ్వానించారు. అయితే ఇందుకు గుర్నాథ్ రెడ్డి ఓకే అన్నట్లు తెలుస్తోంది. శనివారం గాంధీ భవన్ వేదికగా కాంగ్రెస్ కండువా కప్పుకుంటారని సమాచారం. ఇక గుర్నాథ్ రెడ్డి కుమారులు కూడా బీఆర్ఎస్ ను వీడి… కాంగ్రెస్ పార్టీలో చేరుతారని తెలుస్తోంది.