విజయవాడ అంతర్జాతీయ విమానశ్రయం నుంచి రాకపోకలు సాగించే పలు విమాన సర్వీసులను రద్దు చేశారు. చెన్నై విమానాశ్రయాన్ని మూసివేయడంతో అక్కడినుంచి గన్నవరానికి రాకపోకలు నిర్వహించాల్సిన రెండు ఇండిగో విమానాలు రద్దు అయ్యాయి. తిరుపతి, షిర్డీ విమాన సర్వీసులు కూడా రద్దు అయ్యాయి. చెన్నై, షిర్డీ, తిరుపతి వెళ్లాల్సిన ప్రయాణికులు ఇబ్బంది పడ్డారు. తిరుపతి (రేణిగుంట) విమానాశ్రయంలోని రన్‌వేపై నీళ్లు చేరడంతో ఏడు విమాన సర్వీసులు రద్దు అయ్యాయి.