ByGanesh
Tue 08th Apr 2025 08:36 PM
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా మారుతి రూపొందిస్తున్న క్రేజీ మూవీ రాజా సాబ్. ప్రభాస్ ఇప్పటిదాకా చేయని రొమాంటిక్ హారర్ జానర్ లో రాజా సాబ్ సినిమాను దర్శకుడు మారుతి రూపొందిస్తుండటంతో ఈ సినిమా మీద అందరిలో క్యూరియాసిటీ ఏర్పడుతోంది. ప్రస్తుతం తిరుపతి, శ్రీకాళహస్తి దర్శనానికి వెళ్లారు దర్శకుడు మారుతి. ఈ సందర్భంగా సోషల్ మీడియా ద్వారా రెబెల్ ఫ్యాన్స్ రాజా సాబ్ సినిమా అప్డేట్ కోసం రిక్వెస్ట్ చేయగా.. సమాధానం ఇస్తూ షూటింగ్ అప్డేట్ చెప్పారు డైరెక్టర్ మారుతి.
రాజా సాబ్ సినిమా షూటింగ్ చాలా పాజిటివ్ వైబ్స్ తో చేస్తున్నాం. కొంత టాకీ పార్ట్, సాంగ్స్ షూటింగ్ మాత్రమే మిగిలి ఉంది. వివిధ కంపెనీలు సీజీ వర్క్స్ చేస్తున్నాయి. వాటి నుంచి వచ్చే ఔట్ పుట్ చాలా ఎగ్జైటింగ్ గా ఉంది. సాంగ్స్ షూటింగ్ కంప్లీట్ అయితే లిరికల్ సాంగ్స్ ఒక్కొక్కటిగా రిలీజ్ చేస్తాం. సినిమా అంటే సమిష్టి కృషి. ఏ ఒక్కరి క్రాఫ్ట్ కాదు.
ఎంతోమంది శ్రమ ఇందులో ఇన్వాల్వ్ అయి ఉంటుంది. అందుకే అనుకున్న టైమ్ కు కొంత ఆలస్యమవుతోంది. సీజీ వర్క్స్ కంప్లీట్ అయితే నిర్మాణ సంస్థ పీపుల్ మీడియా ఫ్యాక్టరీ రాజా సాబ్ సినిమా విడుదల తేదీని ప్రకటిస్తుంది. ఈ సినిమా కోసం మేము పడిన కష్టాన్ని, మా ప్యాషన్ ను వీలైనంత త్వరగా మీకు చూపించాలని కోరుకుంటున్నాం. అని అన్నారు.
Maruthi Provides Exciting Update on The Raja Saab Movie shoot:
Maruthi Provides Exciting Update on Rebel Star Prabhas The Raja Saab Movie shoot