AP Weather Update: నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం తీవ్ర అల్పపీడనంగా మారింది. రానున్న 24 గంటల్లో తమిళనాడు, ఏపీ తీరం వైపు వెళ్లే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది.ఆ తర్వాత 24 గంటల్లో ఏపీ తీరం వెంబడి ఉత్తరదిశగా పయనించనుండటంతో కోస్తా జిల్లాలకు భారీ నుంచి అతి భారీ వర్ష సూచన జారీ చేశారు.