న్యూఢిల్లీ: మరికొన్ని గంటల్లో కేంద్ర బడ్జెట్ ప్రవేశపెట్టనుండగా గ్యాస్ సిలిండర్ ధరలపై ఊరట లభించింది. వాణిజ్య సిలిండర్ ధర రూ.7 మేర స్వల్పంగా దిగొచ్చింది. హోటళ్ళు, రెస్టారెంట్లు, ఇతర వ్యాపారాలలో వినియోగించే 19 కిలోల కమర్షియల్ గ్యాస్ సిలిండర్‌కు తాజా సవరింపు ధర వర్తించనుంది. దేశ రాజధాని ఢిల్లీలో కమర్షియల్ సిలిండర్ ధర ఇప్పుడు రూ. 1,797కు దిగొచ్చింది. ప్రపంచ మార్కెట్లలో ముడి చమురు రేట్లలో హెచ్చుతగ్గులు మన దేశంలోనూ LPG గ్యాస్ సిలిండర్లపై ప్రభావం చూపుతాయి. అయితే గృహ వినియోగ సిలిండర్ ధరలు యథాతథంగా ఉన్నాయి.
మరిన్ని చూడండి