బర్డ్ ఫ్లూ ఎఫెక్ట్ చికెన్, గుడ్లు తినొద్దని అధికారుల హెచ్చరికలు-భారీగా తగ్గిన ధరలు-bird flu virus effect krishna district officials warning not to eat chicken eggs rates falls ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్

తెలుగు రాష్ట్రాల్లో చికెన్, గుడ్లు ధరలు భారీగా తగ్గాయి. బర్డ్ ఫ్లూ కేసులు వచ్చిన 10 కిలోమీటర్ల పరిధిలో మాత్రమే రెడ్ అలర్ట్ ప్రకటించారు. ఆ ప్రాంతాల్లో చికెన్, గుడ్లు తినొద్దని సూచించారు. ఈ వైరస్ 32-34 డిగ్రీల ఉష్ణోగ్రత వద్ద జీవించదని నిపుణులు చెబుతున్నారు. ఏపీలో ఉష్ణోగ్రత పెరుగుతున్న నేపథ్యంలో ఈ వైరస్ వ్యాప్తిపై భయపడాల్సిన అవసరం లేదని నిపుణులు అంటున్నారు. చికెన్‌ను 20 నిమిషాల పాటు ఉడికిస్తుంటాం. అంటే దాదాపు 100 డిగ్రీల ఉష్ణోగ్రత వద్ద వండుతారు. ఈ ఉష్ణోగ్రతలో వైరస్‌ బతికే అవకాశం లేదని చెబుతున్నారు. పూర్తిగా ఉడికించిన చికెన్, గుడ్లతో సమస్య ఉండదని చెప్పారు.

Source link