బాడీ బిల్డింగ్ చేస్తున్న యువకులకు నిషేధిత స్టెరాయిడ్స్ విక్రయిస్తూ.. అక్రమ దందాకు పాల్పడుతున్న జిమ్ ట్రైనర్‌ను వరంగల్ పోలీసులు అరెస్ట్ చేశారు. అతడి నుంచి రూ.20 వేల విలువైన స్టెరాయిడ్స్ స్వాధీనం చేసుకున్నారు. జిమ్ ట్రైనర్ అరెస్టుకు సంబంధించిన వివరాలను వరంగల్ ఏసీపీ నందిరాంనాయక్ వెల్లడించారు.