బాపట్ల అమర్నాథ్ కుటుంబానికి రూ.10 లక్షలు పరిహారం, ఇంట్లో ఒకరికి ఉద్యోగం-bapatla class 10th student murder collector announces 10 lakh ex gratia govt job for one in family

Bapatla Boy Murder Case : బాపట్ల జిల్లా ఉప్పలవారిపాలెంలో పదో తరగతి విద్యార్థి అమర్నాథ్‌పై పెట్రోల్‌ పోసి నిప్పంటించిన ఘటన రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర కలకలం సృష్టిస్తుంది. దీంతో బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని టీడీపీ నేతలు, స్థానికులు రాస్తారోకో నిర్వహించారు. బాలుడి మృతదేహాన్ని రాజవోలు తీసుకువస్తుండగా మార్గమధ్యంలో చెరుకుపల్లి వద్ద అడ్డుకుని మృతదేహాన్ని జాతీయ రహదారిపై ఉంచి ఆందోళన చేశారు. బాధిత కుటుంబానికి రూ.25 లక్షల పరిహారం ఇవ్వాలని టీడీపీ నేతలు డిమాండ్‌ చేశారు. వాహన రాకపోకలను అడ్డుకున్నారు. సుమారు 3 గంటలపాటు జాతీయ రహదారిపై వాహనాలు నిలిచిపోయి భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. దీంతో రేపల్లె ఆర్డీవో పార్థసారథి చెరుకుపల్లి చేరుకొని కలెక్టర్‌తో ఫోన్‌లో ఆందోళన గురించి మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం నుంచి రూ.10 లక్షల ఆర్థిక సాయం, కుటుంబంలో ఒకరికి ఉద్యోగం, ఇంటి స్థలం ఇస్తామని కలెక్టర్ హామీ ఇవ్వడంతో టీడీపీ నేతలు, స్థానికులు ఆందోళన విరమించారు. అమర్నాథ్‌ మృతదేహాన్ని ఉప్పాలవారిపాలెం తరలించి అంతిమ సంస్కారాలు నిర్వహించారు.

Source link