బాలీవుడ్ లో ట్రెండ్ అవుతున్న కిస్సిక్ బ్యూటీ


Wed 19th Feb 2025 03:20 PM

sreeleela  బాలీవుడ్ లో ట్రెండ్ అవుతున్న కిస్సిక్ బ్యూటీ


Sreeleela trending in Bollywood బాలీవుడ్ లో ట్రెండ్ అవుతున్న కిస్సిక్ బ్యూటీ

కిస్సిక్ బ్యూటీ ఇపుడు బాలీవుడ్ లో ట్రెండ్ అవుతుంది. సౌత్ లో అందులోను టాలీవుడ్ లో బ్యాక్ టు బ్యాక్ మూవీస్ చేస్తున్న శ్రీలీల బాలీవుడ్ ఎంట్రీ ఖాయమైంది. అది కూడా అలాంటి ఇలాంటి స్టార్ తో కాదు, క్రేజీ స్టార్ హీరో తో అమ్మడు ముంబై ఫ్లైట్ ఎక్కడానికి సిద్ధమైంది. నిన్నటివరకు శ్రీలీల హిందీ సినిమాలపై ఎన్ని ప్రచారాలు జరిగినా ఫైనల్ గా కార్తీక్ ఆర్యన్ తో స్క్రీన్ షేర్ చేసుకోబోతుంది ఈ చిన్నది. 

పుష్ప 2 కిస్సిక్ సాంగ్ శ్రీలీల కు ఈ అవకాశం తెచ్చిపెట్టింది అనడంలో సందేహం లేదు కానీ.. నిన్నటివరకు బాలీవుడ్ మీడియా సర్కిల్స్ లో కనిపించని, వినిపించని శ్రీలీల పేరు, పిక్స్ ఇప్పుడు బాలీవుడ్ వెబ్ సైట్స్, ఇంకా హిందీ సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్నాయి. తాజాగా వదిలిన పిక్స్ సోషల్ మీడియాలో ముఖ్యంగా బాలీవుడ్ మీడియాలో సంచలంగా మారాయి. 

బ్లాక్ టాప్, జీన్స్ లో శ్రీలీల లూజ్ హెయిర్ తో చేసిన రచ్చ చూస్తే యూత్ కి నిద్ర కూడా రాదు, అందానికి అందం, గ్లామర్ కు గ్లామర్ తొ శ్రీలీల బ్యూటిఫుల్ లుక్స్ వైరల్ గా మారాయి. 

 


Sreeleela trending in Bollywood:

Sreeleela Becomes Next Big Sensation In Bollywood





Source link