బిగ్ బాస్ సీజన్ 7 కంటెస్టెంట్స్ లిస్ట్ అదేనా?

నిన్న బిగ్ బాస్ కి, నాగార్జునకి హై కోర్టు నోటీసులు పంపించడం హాట్ టాపిక్ అయ్యింది. టివి షోస్ కి సెన్సార్ ఉండాలని ఆదేశించిన కోర్టు ఈసారి బిగ్ బాస్ సీజన్ 7 ప్రసారానికి అనుమతినిస్తుందా అనేది ఇంకా సస్పెన్స్ నడుస్తున్న సమయంలోనే బిగ్ బాస్ లోకి వీళ్ళు వెళుతున్నారు, ఈసారి సీజన్ 7 లో వాళ్ళని చూడబోతున్నాం అంటూ రకరకాల పేర్లు సోషల్ మీడియాలో వినిపిస్తున్నాయి. నాగార్జున హోస్ట్ గా రాబోతున్న బిగ్ బాస్ సీజన్ 7 ప్రోమో అప్పుడే వైరల్ గా మారింది. కుడి ఎడమైతే పొరబాటు లేదోయ్.. అంటూ నాగార్జున అందరిలో ఆసక్తిని క్రియేట్ చేసారు.

అయితే ఈ సీజన్ లోకి జబర్దస్త్ వర్ష, కార్తీక దీపం మోనిత అలియాస్ శోభా రాజ్, అమరదీప్ జంట, అలాగే ఈటీవి ప్రభాకర్ వెళ్ళబోతున్నారని ఎప్పటినుండో వినిపిస్తున్న టాక్. తాజాగా బయటికొచ్చిన లిస్ట్ లో యాంకర్ నిఖిల్ , నృత్య దర్శకుడు ఢీ పండు, గాయని మోహన భోగరాజు, టిక్ టాక్ ద్వారా పాపులరైన దుర్గారావు జంట, నటి విష్ణుప్రియ భీమినేని, హీరో సాయిరోనక్ లతో బిగ్ బాస్ యాజమాన్యం అగ్రిమెంట్స్ చేయించుకుని ఒప్పందాలు కూడా కూర్చుకుంది అనే టాక్ మొదలయ్యింది. 

ఈ సీజన్ లోకి మొత్తం 21 మంది అడుగుపెట్టబోతున్నారని.. ఇప్పటివరకు వినిపిస్తున్న పేర్లు పదే అయినా.. మిగతా పేర్లు అతి త్వరలోనే బయటకి వస్తాయని తెలుస్తోంది. అలాగే ఈ సీజన్ ఒక నెల ముందుగానే అంటే సెప్టెంబర్ నుంచి కాకుండా ఆగష్టు మొదటి వారంలోనే మొదలయ్యే ఛాన్స్ ఉన్నట్లుగా తెలుస్తోంది. 

Source link