ఈ ఒప్పందం ద్వారా డేటా ఆధారిత అంశాల్లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చూపుతున్న చొరవ, సంకల్పాన్ని గేట్స్ ఫౌండేషన్ చైర్మెన్ బిల్ గేట్స్ ప్రశంసించారు. “ఈ ఒప్పందం ద్వారా తక్కువ ధర కు, సులభంగా లభ్యమమ్యే, స్థానికంగా తయారు చేసే వైద్య పరికరాలు, నాణ్యమైన వైద్య సేవలు అందించవచ్చని, తద్వారా ప్రజల జీవితాలను మార్చవచ్చని అన్నారు. ఆరోగ్యం, వ్యవసాయం, విద్య రంగాల్లో AI, టెక్నాలజీ వినియోగం ద్వారా అందరికీ ఆదర్శంగా నిలవచ్చు ” అని అన్నారు.