Teegala Krishna Rao : బీఆర్ఎస్ పార్టీకి మరో ఎదురుదెబ్బ తగిలింది. బీఆర్ఎస్ కీలక నేత, మహేశ్వరం మాజీ ఎమ్మెల్యే తీగల కృష్ణారెడ్డి కాంగ్రెస్ కండువా కప్పుకోనున్నారు. తన కోడలు, రంగారెడ్డి జిల్లా పరిషత్ ఛైర్ పర్సన్ అనితారెడ్డితో కలిసి తీగల కృష్ణారెడ్డి కాంగ్రెస్ గూటికి చేరేందుకు రెడీ అయ్యారు. కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ ఛార్జ్ మాణిక్ రావు ఠాక్రే, టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డితో తీగల కృష్ణారెడ్డి మంగళవారం సమావేశమయ్యారు.