సభ నిర్వహణకు స్థలం ఖరారు కాగా.. ఇక ఏర్పాట్లపై ఆ పార్టీ నేతలు ఫోకస్ పెట్టారు. దాదాపు 10 లక్షల మంది తరలివచ్చే అవకాశం ఉందని, సభ, ఇతర అవసరాలకు దాదాపు 1200 ఎకరాల వరకు అవసరమని అంచనా వేశారు. ఈ మేరకు రెండు రోజుల కిందట ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు పెద్ది సుదర్శన్ రెడ్డి, వొడితెల సతీశ్ బాబు, దాస్యం వినయ్ భాస్కర్, ఇతర నేతలంతా కలిసి రూట్ మ్యాప్ తో పాటు సభ నిర్వహణ స్థలాన్ని పరిశీలించారు.