కళాతోరణం కాంట్రవర్సీ..
‘తెలంగాణ చిహ్నం నుండి కాకతీయ కళాతోరణం, చార్మినార్ తీయాలని చూస్తున్నారు. వరంగల్ వాళ్లం ఆత్మగౌరవం ఉన్నోల్లం. రాణి రుద్రమ దేవి సాక్షిగా, సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ సాక్షిగా, దొడ్డి కొమురయ్య సాక్షిగా, చాకలి ఐలమ్మ సాక్షిగా, సమ్మక్క సారక్క సాక్షిగా మా ఆత్మగౌరవం కొరకు పోరాడుతాం. రాజముద్రలో నుండి కాకతీయ కళాతోరణం, చార్మినార్ మార్చవద్దు.. మారిస్తే మళ్లీ మేము అధికారంలోకి రాగానే తెచ్చుకుంటాం’ అని పల్లా రాజేశ్వర్ రెడ్డి వ్యాఖ్యానించారు.