బెట్టింగ్ యాప్‌‌లకు ప్రమోషన్‌, విశాఖలో లోకల్ బాయ్ నాని అరెస్ట్-local boy nani arrested in visakhapatnam for promoting betting apps ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్

దీంతో సైబర్ క్రైమ్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఇన్స్టాగ్రామ్, ఫేస్ బుక్, యూట్యూబ్ ద్వారా కలర్ ప్రిడిక్షన్ బెట్టింగ్ యాపను ప్రమోట్ చేశాడని, అందుకు డబ్బు కూడా తీసుకున్నట్టు గుర్తించారు. దీంతో నానిని అరెస్ట్ చేసి శనివారం రాత్రి రిమాండ్‌కు పంపారు. మరికొందరు సోషల్ మీడియా ఇన్ ఫ్లూయెన్సర్లు కూడా బెట్టింగ్ యాప్‌లను ప్రమోట్ చేసినట్టు పోలీసుల దర్యాప్తులో తేలడంతో వారిపైనా త్వరలో చర్యలు తీసుకుంటామని సీపీ శంఖబ్రత బాగ్చి వివరించారు. తమ సొంత ప్రయోజనాల కోసం యువతను తప్పుదారి పట్టించడం, బెట్టింగ్ యాప్‌లను ప్రమోట్ చేయడం వంటివి చేస్తే చట్టపరమైన చర్యలు తప్పవని సీపీ హెచ్చరించారు.

Source link